Thursday 25th July 2024
12:07:03 PM
Home > తాజా > లాస్యను వెంటాడిన మృత్యువు.. రెండు ప్రమాదాల నుంచి బయటపడి..!

లాస్యను వెంటాడిన మృత్యువు.. రెండు ప్రమాదాల నుంచి బయటపడి..!

lasya nanditha

MLA Lasya Nanditha | హైదరాబాద్ ఓఆర్ఆర్ (ORR)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతి చెందిన విషయం తెలిసిందే.

శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో లాస్య స్పాట్ లోనే మరణించారు. సాయంత్రం ఆమె అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

కాగా, ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుంచి లాస్య మూడు ప్రమాదాలు ఎదుర్కొన్నారు. 2023 డిసెంబర్ లో సికింద్రాబాద్ లో ఓ కార్యక్రమానికి హాజరైన లాస్య ఓవర్‌లోడ్ కారణంగా లిఫ్ట్ ఆరు అడుగుల ఎత్తులో కూలిపోవడంతో అందులో ఇరుక్కుపోయారు. ఆ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.

రెండోసారి ఫిబ్రవరి 13న కేసీఆర్‌ సభకు హాజరయ్యేందుకు నల్గొండ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక హోంగార్డు మృతి చెందాడు.

తాజాగా మూడోసారి శుక్రవారం జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తండ్రి మరణించిన సరిగ్గా ఏడాదికే లాస్య కూడా మృతిచెందడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

You may also like
lasya nanditha
అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు.. సీఎం ఆదేశం!
brs mla lasya nanditha
BRS MLA లాస్య నందిత మృతి.. తండ్రి మరణించిన ఏడాదికే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions