Friday 29th May 2026
12:07:03 PM
Home > తాజా > హైడ్రాలో ‘ఈగల్ టీమ్’ సంచలనం.. ట్రాన్స్‌ జెండర్ల ఉద్యోగాలతో కొత్త వెలుగులు!

హైడ్రాలో ‘ఈగల్ టీమ్’ సంచలనం.. ట్రాన్స్‌ జెండర్ల ఉద్యోగాలతో కొత్త వెలుగులు!

  • ఏకంగా 860 ఎకరాల ప్రభుత్వ భూమి సేవ్!

Hydraa Eagle Team Transgenders | తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక విభాగం ‘హైడ్రా’ (HYDRAA) తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం ట్రాన్స్‌ జెండర్ల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపడమే కాకుండా, ప్రభుత్వ భూముల రక్షణలో సంచలన ఫలితాలను ఇస్తోంది.

సమాజంలో ఎంతో కాలంగా ఉపాధి కోసం ఎదురుచూస్తున్న 16 మంది ట్రాన్స్‌ జెండర్లకు హైడ్రా ప్రత్యేకంగా విధుల్లోకి తీసుకుంది. ఇందులో 11 మంది ట్రాన్స్ ఉమెన్, ఐదుగురు ట్రాన్స్ మెన్ ఉన్నారు. వీరందరినీ కలిపి ప్రత్యేకంగా “హైడ్రా ఈగల్ టీమ్” (HYDRAA Eagle Team) గా నామకరణం చేసి క్షేత్రస్థాయి విధులను అప్పగించారు.

భూకబ్జాల చెరను వదిలిస్తున్న ‘ఈగల్ టీమ్’ నగరంలోని చెరువులు, నాలాల కబ్జాలను తొలగించడంలో మరియు పార్కులు, ప్రజావసరాల స్థలాలను కాపాడటంలో ఈ ఈగల్ టీమ్ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోందని అధికారులు వెల్లడించారు.

862 ఎకరాల ల్యాండ్ సేవ్..
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం, ఐలాపూర్‌లో ఏకంగా 862 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల బారి నుంచి కాపాడటంలో ఈ ట్రాన్స్‌ జెండర్ల బృందం అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శించింది.

 ఇటీవల మాదాపూర్ పరిధిలోని కీలకమైన ‘ఈదులకుంట’ చెరువును ఆక్రమణల నుండి కాపాడటంలో కూడా వీరు ముందుండి విజయం సాధించారని హైడ్రా ఉన్నతాధికారులు సగర్వంగా ప్రకటించారు.

హైడ్రా కల్పించిన ఈ అరుదైన అవకాశంతో తమ బతుకులకు ఒక గౌరవం, సమాజంలో గుర్తింపు లభించాయని ట్రాన్స్‌జెండర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 శాంతిభద్రతల పరిరక్షణతో పాటు కబ్జాల నిరోధంలో పురుషులు, మహిళలతో సమానంగా తాము కూడా క్షేత్రస్థాయిలో దూసుకుపోతామని ఈగల్ టీమ్ నిరూపించింది.

ట్రాన్స్‌ జెండర్లకు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా, ఇలాంటి బాధ్యతాయుతమైన ప్రభుత్వ విధుల్లో భాగస్వామ్యులను చేయడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions