Friday 31st July 2026
12:07:03 PM
Home > Uncategorized > పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. !

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. !

harihara veera mallu

ఆ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది!
Harihara Veeramallu Release Date | టాలీవుడ్ పవర్ స్టార్ (Powarstar) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొత్త సినిమా కోసం అభిమానులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) గా సేవలందిస్తూనే వీలు చిక్కినప్పుడు అంతకు ముందు అంగీకరించిన సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.

పవన్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను మే 9న విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.

రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని మే 9 న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పవన్, నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ఇద్దరూ గుర్రపుస్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. నిధి అగర్వాల్, బాబీ దేవోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషించారు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఎం రత్నం సమర్పణలో ఎ. దయాకర్రావు నిర్మిస్తున్నారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తునారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
సోషల్ మీడియా ట్రోల్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions