Tuesday 16th June 2026
12:07:03 PM
Home > తాజా > పెళ్లి భోజనంలో రోటీలు ఆలస్యం.. ఏకంగా వధువునే మార్చేసిన వరుడు!

పెళ్లి భోజనంలో రోటీలు ఆలస్యం.. ఏకంగా వధువునే మార్చేసిన వరుడు!

UP Marriage

UP Wedding Incident | యూపీ (Uttar Pradesh)లోని చందౌలీ (Chandouli) జిల్లా హమీద్‌పూర్ అనే గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. వరుడి బంధువులకు రోటీలు ఆలస్యంగా వడ్డించడంతో గొడవ జరిగి చివరికి వధువు మారిపోయింది.

వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 22 న మెహతాబ్ అనే వరుడు హమీద్ పూర్ లోని వధువు ఇంటి వద్ద పెళ్లి మండపానికి చేరుకున్నారు. వరుడి బంధువులకు పెళ్లిలో భోజనానికి ఏర్పాట్లు చేశారు.

అయితే వారికి రోటీలు ఆలస్యంగా వడ్డించారు. దీంతో వరుడి తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ చిన్న గొడవ మొదలై చివరికి పెళ్లి ఆగిపోయింది.

పెళ్లి కుమారుడు మెహతాబ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అదే రాత్రి మరో అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు.

అయితే ఇక ఈ విషయం పెళ్లి ఆగిపోయిన వధువు బంధువులకు తెలియడంతో వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆ పెళ్లి కోసం తాము రూ.7 లక్షలు ఖర్చు చేశామని.. వీటితోపాటు వరుడికి కట్నంగా రూ.1.5 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు.

తమ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మధ్యలో వదిలేసి మరో మహిళను పెళ్లి చేసుకున్న వరుడు మెహతాబ్‌, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఎస్పీని కోరినట్లు వధువు కుటుంబ సభ్యులు తెలిపారు.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions