Saturday 8th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..బాబాయ్-అబ్బాయ్ ఒకే వేదికపై

‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..బాబాయ్-అబ్బాయ్ ఒకే వేదికపై

Game Changer Pre Release Event | గ్లోబల్ స్టార్ రాంచరణ్ ( Ram Charan ) కథానాయకుడిగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన మూవీ గేమ్ ఛేంజర్. జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరవనున్నారు.

దింతో బాబాయ్-అబ్బాయ్ ఒకే వేదికపై కనిపించనుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ( Kandula Durgesh ) ఈవెంట్ ఏర్పాట్లను పరిశీలించారు.

కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తో మాట్లాడారు. అభిమానుల తాకిడికి దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇది అభిమానులకు కన్నులపండుగ కానుందని మంత్రి పేర్కొన్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions