Friday 8th November 2024
12:07:03 PM
Home > తాజా > పంజాగుట్టలో అగ్నిప్రమాదం.. ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్..!

పంజాగుట్టలో అగ్నిప్రమాదం.. ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్..!

Panjagutta Fire Accident| పంజాగుట్ట ( Panjagutta ) లోని ఒక అపార్ట్మెంట్ ( Apartment ) లో అగ్ని ప్రమాదం ( Fire Accident ) సంభవించగా వెంటనే స్పందించిన ట్రాఫిక్ ( Traffic ) కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని రక్షించారు.

వివరాల్లోకి వెళ్తే పంజాగుట్టలోని ఓ అపార్ట్మెంట్ లో షార్ట్ సర్క్యూట్ ( Short Circuit ) కారణంగా ఐదు, ఆరవ అంతస్తులో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున మంటలు చెలరేగడం తో ఆ అపార్ట్మెంట్ లో నివసించే వారు లోపాలనే ఇరుక్కుపోయారు.

అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ( Constable ) శ్రవణ్ కుమార్ ( Shravan Kumar ) హుటాహుటిన ఆరవ అంతస్తు చేరుకొని తలపులు బద్దలు కొట్టి, కుటుంబాన్ని రక్షించారు.

అలాగే దశరథ రాంరెడ్డి ( Dasaratha Ram Reddy ) మరియు సత్యనారాయణ ( Satyanarayana ) అనే మరో ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా అక్కడ నివసించే వారిని రక్షించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

ఈ ప్రమాదంలో ఎవరికి ఏ హాని జరగలేదని తెలిపారు పోలీసులు. కాగా తమ ప్రాణాలకు తెగించి మాటల్లో చిక్కుకున్న వారిని రక్షించిన కానిస్టేబుల్స్ ను అందరూ అభినందిస్తున్నారు.

You may also like
anitha vangalapudi
డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోం మంత్రి అనిత!
తెలంగాణలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు అప్పులు ఎక్కువే
ys vijayamma
YS Family ఆస్తుల వివాదం.. విజయమ్మ సంచలన లేఖ!
Lamborghini Car
విల్లా కొంటే లాంబోర్గిని కార్ ఫ్రీ.. రియల్ ఎస్టేట్ సంస్థ బంపరాఫర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions