Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > ముస్లింల పేరిట ఎంఐఎం వ్యాపారాలు చేస్తోంది కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన ఆరోపణలు!

ముస్లింల పేరిట ఎంఐఎం వ్యాపారాలు చేస్తోంది కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన ఆరోపణలు!

Feroz Khan On Owaisi | తెలంగాణ ( Telangana ) అసెంబ్లీ ( Assembly ) సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు అక్బరుద్దిన్ ఒవైసి ల మధ్య మాటల యుద్ధం జరిగింది.

అసెంబ్లీ లో ముస్లిం ల గొంతు నొక్కి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని అక్బరుద్దీన్ ( Akbaruddin ) వ్యాఖ్యానించగా, అక్బరుద్దీన్ ని ఒక ముస్లిం నేతగా చూడట్లేదని, కేవలం ఎంఐఎం ( AIMIM ) నేతగానే చూస్తాం అని తెలిపారు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ).

అలాగే గత బీఆరెస్ ( Brs ) పాలనను కీర్తిస్తూ మాట్లాడితే వినడానికి తాము సిద్ధంగా లేమని అక్బరుద్దీన్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం. కాగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ( Feroz Khan ).

అక్బరుద్దీన్ మరియు ఆయన పార్టీ ముస్లిం ( Muslims ) ల పేరు చెప్పుకుని వ్యాపారాలు మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏండ్ల బీఆరెస్ పాలనలో ఒవైసి ( Owaisi ) ఎప్పుడు కూడా మైనారిటీ సమస్యలపై కేసీఆర్ ( Kcr ) ను ప్రశ్నించలేదన్నారు.

ఇక ఎంఐఎం సమయం ముగిసి పోయిందని, ఇప్పుడు ఓల్డ్ సిటీ ( Old City ) అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుందని స్పష్టం చేశారు ఫిరోజ్ ఖాన్.

You may also like
cm revanth speech
ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం’: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions