Saturday 19th July 2025
12:07:03 PM
Home > క్రీడలు > ‘ఆర్సీబీని ధోనీసేన ఆదర్శంగా తీసుకోవాలి’

‘ఆర్సీబీని ధోనీసేన ఆదర్శంగా తీసుకోవాలి’

CSK Playoff Chances | ఐపీఎల్ లో ఐదు టైటిళ్లు గెలిచిన టీం. అనుభవం ఉన్న ఆటగాళ్లు, అంతేకాకుండా ఎంఎస్ ధోని కెప్టెన్. అయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములను ఎదుర్కోవడం అభిమానుల్ని నిరాశకు గురిచేస్తుంది.

ఇలానే కొనసాగితే చెన్నై ప్లేఆప్స్ కు చేరుకోవడం అసాధ్యం అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో చెన్నై, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి కారణం 2024 ఐపీఎల్ లో ఆర్సీబీ ఆదిలో చేతికలపడ్డా ఆ తర్వాత పుంజుకొని ప్లేఆప్స్ చేరుకుంది.

తొలి ఎనమిది మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయం. అందులోనూ వరుసగా ఆరు ఓటములు. దింతో ఆర్సీబీ కథ ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా ఆరు మ్యాచుల్లో గెలుపొంది బెంగళూరు ప్లేఆప్స్ చేరుకుంది.

ఇది ఇప్పటికీ ఆర్సీబీ అభిమానులకు తీపి గుర్తుగా మిగిలిపోయింది. ప్లేఆప్స్ లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయినా ఆర్సీబీ ప్లేఆప్స్ కు చేరిన తీరు మాత్రం ప్రశంసలకు కారణమయ్యింది. ఈ నేపథ్యంలో చెన్నై కూడా ఆర్సీబీ మాదిరిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇప్పటి వరకు ఎనమిది మ్యాచులు ఆడిన చెన్నై రెండింట్లో గెలిచి నాలుగు పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. మిగిలిన ఆరు మ్యాచుల్లో గెలిచి, నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుంటే చెన్నై ప్లేఆప్స్ కు చేరుకోవడం ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ధోని కూడా ప్లేఆప్స్ కు క్వాలిఫై అవ్వడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోమని స్పష్టం చేశారు.

You may also like
‘పహల్గాం ఉగ్రవాదుల్ని పట్టుకోలేదు..అప్పుడే పాక్ తో మ్యాచులా?’
షారూక్ ఖాన్ కు గాయం..చికిత్స కోసం అమెరికాకు
ktr pressmeet
లోకేశ్ ను కలవలేదు.. కలిస్తే తప్పేంటి: కేటీఆర్
‘మనసుకు చాలా సంతోషంగా ఉంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions