Sunday 27th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఒక నెల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళం గా ఇద్దాం’

‘ఒక నెల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళం గా ఇద్దాం’

Cm Revanth Reddy News | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో మన సైన్యం దేశ సార్వభౌమత్వం, పౌరుల రక్షణ కోసం వీరోచితంగా పోరాడుతుంది.

పాక్ దాడులను పటాపంచలు చేస్తూ, ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యానికి అండగా నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్ర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రతిపాదించారు. ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని కోరారు.

సీఎం నిర్ణయంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి విరాళాన్ని ప్రకటించనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులు కూడా ముందుకు రావాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions