Friday 31st July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అయ్యా మాకు లోన్లు ఇవ్వండి..పాక్ భిక్షాటన !

అయ్యా మాకు లోన్లు ఇవ్వండి..పాక్ భిక్షాటన !

Pakistan Begs For Loans To International Partners | భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ పాకిస్థాన్ పిచ్చి ప్రేలాపణలు చేస్తుంది. మరోవైపు మా దేశం దివాళా తీస్తోంది, లోన్లు ఇచ్చి ఆదుకోండి అంటూ ప్రపంచ దేశాలు, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వద్ద మొరపెట్టుకుంటుంది.

పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. అనంతరం ఉగ్రవాదులపై యుద్ధంలో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో దాడులు చేశాయి.

ఈ క్రమంలో ఉగ్ర శిబిరాలు నేలమట్టం అయ్యాయి. భారత ఆపరేషన్ సింధూర్ తో పాక్ వెన్నులో వణుకు మొదలయ్యింది. అనంతరం ఉగ్రవాదులపై భారత పోరును ఆదుకోవడానికి, టెర్రరిస్టులకు మద్దతుగా పాక్ భారత్ పై డ్రోన్లు, ఇతర సైనిక ఆయుధాలతో దాడి చేసే యత్నం చేసింది.

ఓ వైపు భారత్ ఉగ్రవాదులపై దాడులు చేస్తుంటే, పాక్ మాత్రం భారత పౌరులు, ఎయిర్పోర్టులు, సైనిక కేంద్రాలను లక్ష్యం చేసుకోవడం ఆ దేశ వక్రబుద్దిని సూచిస్తోంది. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందులతో, బలోచిస్థాన్ స్వాంతత్య్ర పోరాటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ ఇప్పుడు భారత్ పై దాడులు చేసే క్రమంలో దీనావస్థ స్థితికి చేరుకుంటుంది.

ఈ నేపథ్యంలో మాకు లోన్లు ఇవ్వండని పాక్ భిక్షాటన మొదలుపెట్టింది. భారత దాడులతో దాయాధి దేశ స్టాక్ మార్కెట్లు కుదేలు అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత దాడులతో తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని మోసలికన్నీరు కారుస్తూ లోన్లు ఇప్పించాలని పాక్ మొరపెట్టుకుంటుంది.

ఆర్థిక సహాయం చేయాల్సిందిగా ఇతర దేశాలను కోరింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పాక్ ప్రభుత్వం ఒక పోస్ట్ చేసింది. దింతో పాక్ నవ్వులపాలయ్యింది. దీనిని కప్పిపుచ్చుకోవడానికి తమ ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశారని పాక్ వాపోయింది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions