Thursday 24th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘సైన్యానికి సహకారంలో తెలంగాణ ఎల్లప్పుడూ ముందు’

‘సైన్యానికి సహకారంలో తెలంగాణ ఎల్లప్పుడూ ముందు’

CM Revanth Reddy Holds Key Meeting With Indian Army Officials | దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లో కేంద్రానికి, భారత సైన్యానికి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే వికారాబాద్‌ దామగుండం వద్ద లో-ఫ్రీక్వెన్సీ #VLF నేవీ రాడార్ స్టేషన్‌కు 3 వేల ఎకరాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం “సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్” జరిగింది. భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి సమావేశంలో ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు.

సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో 2 నుంచి 4 సైనిక్ స్కూళ్లను మంజూరు చేశారన్న విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేస్తూ గడిచిన పదేళ్లలో తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని చెప్పారు. తెలంగాణలో తక్షణం సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions