CM Revanth Felicitates Gongadi Trisha | ఇటీవల భారత అండర్ 19 మహిళల క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
అండర్-19 మహిళల T20 ప్రపంచకప్ ఫైనల్‌లో నిక్కీ ప్రసాద్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా మహిళల జట్టును ఓడించి వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.
ఈ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమెను శాలువాతో సత్కరించారు. త్రిషకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. కోటి నజరానా ప్రకటించారు.
భవిష్యత్తులో భారత్ జట్టు తరఫున మరింత ఉన్నతంగా రాణించి, మరిన్ని ట్రోఫీలు గెలుపోందాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు.