Cm Revanth Reddy Birthday | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) పుట్టినరోజు నవంబర్ 8. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రేవంత్ తొలి పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో సీఎం పై తన అభిమానాన్ని చాటుకున్నారు సిరిసిల్ల ( Sircilla ) కళాకారుడు. సీఎం రేవంత్ పుట్టినరోజు సందర్భంగా, సిరిసిల్లకు చెందిన కళాకారుడు హరిప్రసాద్ ( Hariprasad ) పట్టు వస్త్రంపై రేవంత్ రెడ్డి చిత్రం వచ్చేలా నేసి అబ్బురపరిచాడు.
దాదాపు ఐదు రోజులపాటు శ్రమించి హరిప్రసాద్ దీన్ని తయారుచేశారు. మరోవైపు, ఒరిస్సా ( Odisha ) లోని పూరి సముద్ర తీరం బీచ్ లో సైతిక శిల్పం ఆవిష్కరణతో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సీఎం రేవంత్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు.