Tuesday 10th December 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > నేను వైఎస్సార్ కు పుట్టలేదన్నారు..వర్రా రవీందర్ పై షర్మిల కన్నెర్ర

నేను వైఎస్సార్ కు పుట్టలేదన్నారు..వర్రా రవీందర్ పై షర్మిల కన్నెర్ర

Ys Sharmila On Varra Ravindra Reddy | సోషల్ మీడియా ( Social Media ) వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ( Ys Sharmila ) మండిపడ్డారు.

మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారన్నారు. ‘సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిగా చెప్తున్నాను… అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టీ ..పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి.

నా మీద, అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికే పుట్టలేదని అవమానించారు. నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై నేను కూడా పోలీస్ కేసు పెట్టాను.

అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నాం.’ అని షర్మిల పేర్కొన్నారు. మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హాననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ ( Demand ) చేశారు.

You may also like
ponnam prabhakar
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. కేసీఆర్ కు మంత్రి ఆహ్వానం!
parcel
ఫేక్ పార్సిల్స్ వస్తున్నాయ్.. బీ అలెర్ట్!
పుష్ప-2 రిలీజ్..మెగా ఫ్యాన్స్ కు నాగబాబు విన్నపం
cm revanth reddy
వాళ్ల ముందు మాట్లాడటానికి భయపడ్డా: సీఎం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions