Tuesday 22nd September 2026
12:07:03 PM
Home > తాజా > నేను తెలంగాణ వాడిని..సింగర్ క్రిస్ మార్టిన్

నేను తెలంగాణ వాడిని..సింగర్ క్రిస్ మార్టిన్

Chris Martin Says He Is From Telangana | ప్రముఖ ఇంగ్లీష్ మ్యూజిక్ బ్యాండ్ ‘ కోల్డ్ ప్లే’ ( Cold Play ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతను ఈ బ్యాండ్ ఉర్రూతలుగిస్తుంది.

భారత్ లో రెండు చోట్ల జరిగిన కోల్డ్ ప్లే ఈవెంట్స్ కు భారీ స్పందన వచ్చింది. తొలుత కోల్డ్ ప్లే ఈవెంట్ ముంబైలో జరగగా బాలీవుడ్ మరియు పారిశ్రామిక ప్రముఖులు హాజరై సందడి చేశారు. తాజగా గుజరాత్ అహ్మదాబాద్ లో ఆదివారం కోల్డ్ ప్లే సెకండ్ ఈవెంట్ ( Cold Play Second Event ) ఉత్సాహంగా జరిగింది.

టీం ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) ముఖ్య అతిథిగా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. అయితే ఈవెంట్ సందర్భంగా సింగర్ క్రిస్ మార్టిన్ ( Chris Martin ) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా ‘మీ అందరికీ తెలుసు నేను తెలంగాణ వాడిని’ అంటూ క్రిస్ మార్టిన్ వ్యాఖ్యానించారు. దింతో అక్కడ ఉన్న ప్రేక్షకులు హర్షధ్వానాలతో సందడి చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions