Chiranjeevi shares emotional note for Ram Charan on completing 18 years in films | మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరిగ్గా 18 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిరుత’ సినిమాతో రాంచరణ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తనయుడి సినీ ప్రయాణంపై భావోద్వేగ పోస్ట్ చేశారు.
‘చరణ్ బాబు, 18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ..విజయోస్తు’ అని చిరు పేర్కొన్నారు.









