KTR Satires On Rahul Gandhi | తెలంగాణ కులగణన నివేదిక (Telangana Caste Census) పై చర్చ కోసం మంగళవారం ఏర్పాటు చేసిన అసెంబ్లీ (Telangana Assembly) ప్రత్యేక సమావేశంపై బీఆరెస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.
అసెంబ్లీ సమావేశం తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టంచేసిందని పేర్కొన్నారు. ఏడాదికాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదని విమర్శించారు.
“బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసింది. అసెంబ్లీ లో సమర్పించిన డేటాపై రాష్ట్ర సర్కారుకే ఏమాత్రం క్లారిటీ లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదని నిన్నటితో తేలిపోయింది.
రిజర్వేషన్ల అంశంపై నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) యూటర్న్ తీసుకుంది. కేంద్రంపైకి నెపం నెట్టి తప్పించుకోవాలని పన్నాగం వేసింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇచ్చిన ఎన్నికల హామీలు, చెప్పిన గ్యారెంటీలు, చేసిన డిక్లరేషన్లన్నీ బూటకమని తేలిపోయింది.
అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్దిపొందడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న రాహుల గాంధీ గారు తన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకుంటే మంచిది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం.. ఈ సర్కారు నిబద్ధత వంద శాతం నకిలీ” అని వ్యాఖ్యానించారు.