Sharukh Requests South Stars | బాలీవుడ్ (Bollywood) బాద్ షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) సౌత్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ (Dubai) వేదికగా జరిగిన గ్లోబల్ విలేజ్ (Global Village) కార్యక్రమంలో పాల్గొన్న షారుఖ్ అక్కడ వేదికపై డాన్స్ తో అలరించారు.
అనంతరం మాట్లాడుతూ దక్షిణాది హీరోల డాన్స్ మూమెంట్స్ పై ఇంట్రెస్టింట్ కామెంట్స్ చేశారు. సౌతిండియా స్టార్స్ అయిన ప్రభాస్, మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, యశ్, రజనీకాంత్, విజయ్ తదితరులు తన స్నేహితులని పేర్కొన్న ఆయన వారికి ఒక రిక్వెస్ట్ చేశారు.
దయచేసి వేగంగా డ్యాన్స్ చేయడం ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. డ్యాన్స్ విషయంలో సౌత్ స్టార్లను ఫాలో అవడం కష్టమంటూ నవ్వించారు. దీనికి సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.