Sunday 14th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > BMW కార్ ను ఢీకొట్టిన డెలివరీ బాయ్.. ఓనర్ ఏం చేశాడంటే!

BMW కార్ ను ఢీకొట్టిన డెలివరీ బాయ్.. ఓనర్ ఏం చేశాడంటే!

delivary boy hits bmw

Delivery Boy Hits BMW | ఒక నగరంలో నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై తరచూ ఏవో చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో రోడ్ రేజ్ తో మనుషుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటుంటాయి. అయితే రద్దీగా ఉండే ముంబై రోడ్ పై ఓ లగ్జరీ కార్ ఓనర్ చేసిన పనికి అతడిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నయి.

ముంబైకి చెందిన సిద్ధార్థ్ భరద్వాజ్ ఇటీవల సిద్ధార్థ్ నడుపుతున్న BMW కారును ఒక డెలివరీ బాయ్ అనుకోకుండా ఢీకొట్టాడు. కారుపై గీతలు పడ్డాయి.  ఆ సమయంలో సిద్ధార్థ్ ఆ డెలివరీ బాయ్ పై ఆగ్రహం వ్యక్తం చేయలేదు. కారు డ్యామేజికి నష్టపరిహారం ఇవ్వాలని డెలీవరీ బాయ్ అని అడిగాడు.

వెంటనే డెలివరీ బాయ్ కన్నీళ్లు పెట్టుకొని, తన తల్లి టెర్మినల్ క్యాన్సర్‌తో పోరాడుతోందని, ఆమె చికిత్స కోసం పగలు–రాత్రి పని చేస్తున్నానని వివరించాడు. అది విన్న సిద్ధార్థ్ మనసు కరిగిపోయింది. అతను ఒక్క రూపాయి కూడా అడగకుండా యువకుడిని క్షమించాడు.

“కారు మరమ్మతు చేయడం కంటే ఒక ప్రాణాన్ని కాపాడటం ముఖ్యం” అంటూ తన సొంత డబ్బుతో కారును రిపేర్ చేయించుకుంటానని చెప్పాడు. ఈ ఘటనను వీడియో తీసి ఇన్ స్టాలో అప్ లోడ్ చేయడంతో అది వైరల్ అవుతోంది.

You may also like
salon in atm
ఏటీఎంలో సెలూన్.. వీడియో వైరల్!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions