Monday 15th June 2026
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ లను సీజ్ చేయాలి: బండి

కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ లను సీజ్ చేయాలి: బండి

Congratulations to Bandi Sanjay

‌- బీజేపీ ఎంపీ సంచలన డిమాండ్!

Bandi Sanjay | కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ మేరకు మాట్లాడుతూ..కేసీఆర్ మినహా మిగిలిన ఆయన కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ లు సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే ఓడిపోయిన మాజీ మంత్రుల, ఎమ్మెల్యేల పాస్పోర్ట్ లు కూడా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు బండి. వారి పాలనలో ప్రజల, ప్రభుత్వ ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు. అలాగే బీఆరెస్ పాలనలో వారి అరాచకాలు వర్ణించలేని విధంగా ఉండేవని పేర్కొన్నారు.

ఇప్పటి ప్రభుత్వం విచారణ ప్రారంభిస్తే బీఆరెస్ నేతలు పారిపోయే ప్రమాదం ఉందని, సీఎం రేవంత్ రెడ్డి వీరి పాస్పోర్ట్ లను స్వాధీనం చేసుకోవాలని కోరారు.

అంతేకాకుండా సీఎంఓ లో పదవి విరమణ పొందిన అధికారులు కూడా పెద్ద ప్రజలను కొల్లగొట్టి అక్రమంగా డబ్బులు సంపాదించారని, అందుకోసం వారి పాస్పోర్ట్ లను కూడా స్వాధీనం చేసుకోవాలని కోరారు బండి సంజయ్.

You may also like
bandi sanjay kumar
నేనేం ఫాంహౌస్‌ ఎలుకను కాదు.. బండి సంజయ్ హాట్ కామెంట్స్!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
వందేమాతరానికి అవమానంపై చర్యలేవి?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions