Saturday 30th May 2026
12:07:03 PM
Home > క్రీడలు > వన్డేల్లో అత్యధిక స్కోర్..బీహార్ భళా!

వన్డేల్లో అత్యధిక స్కోర్..బీహార్ భళా!

Bihar breaks record for highest ever one-day total | విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బీహార్ జట్టు అద్భుత ఫీట్ ను సొంతం చేసుకుంది. ఆ జట్టు ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సిక్సులు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించి నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 576 పరుగులు చేసింది. 45 ఓవర్లలోనే 500 పరుగుల మార్కును అందుకుని చరిత్ర సృష్టించింది. వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. రాంచీ వేదికగా బుధవారం అరుణాచల్ ప్రదేశ్-బీహార్ మధ్య మ్యాచ్ జరిగింది.

విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి రెచ్చిపోయాడు. 15 సిక్సులు, 16 ఫోర్లతో కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేశాడు. బీహార్ జట్టు కెప్టెన్ సకిబుల్ ఘనీ 32 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. లిస్టు-ఏ క్రికెట్ లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. మొత్తంగా 40 బంతుల్లో ఘనీ 128 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆయుష్ 56 బంతుల్లో 116 పరుగులు, పీయూష్ సింగ్ 66 బంతుల్లో 77 పరుగులు చేశారు. ఇలా బ్యాటర్లు చెలరేగిపోవడంతో బీహార్ 50 ఓవర్లలో 574 పరుగులు చేసింది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions