Monday 14th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రభుత్వ ఆఫీసుల్లో డిప్యూటీ సీఎం ఫొటో.. హైకోర్టు ఏమందంటే!

ప్రభుత్వ ఆఫీసుల్లో డిప్యూటీ సీఎం ఫొటో.. హైకోర్టు ఏమందంటే!

pawan kalyan photo

Pawan Kalyan Photo in Govt Office | ఆంధ్రప్రదేశ్ (Andra Pradesh) ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఫొటోను ప్రదర్శించడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది.

చట్టపరమైన అనుమతులు లేకుండా డిప్యూటీ సీఎం ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తూ వై. కొండలరావు అనే విశ్రాంత రైల్వే ఉద్యోగి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటోను పెట్టేందుకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, చట్టపరమైన నిబంధనలు లేవని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఫొటోల ప్రదర్శనపై ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించే వరకు, కార్యాలయాల నుంచి పవన్ కల్యాణ్ ఫొటోలను వెంటనే తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ పిటీషన్ ను ధర్మాసనం కొట్టేసింది.

డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. కేవలం రాజకీయ కారణాలతోనే పిటిషన్ వేశారంటూ ఈ పిల్ ను కొట్టేసింది. సమాజానికి పనికి వచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది.

You may also like
‘Coolphabets’ యాప్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు!
కుప్పకూలిన 50 అడుగుల హై-మాస్ట్ లైట్.. తప్పిన పెను ప్రమాదం!
కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్!
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions