MM Keeravani Meets CM Revanth | ప్రముఖ తెలంగాణ కవి అందే శ్రీ (Ande Sri) మరియు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో భేటీ అయ్యారు.
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడిన తర్వాత రాష్ట్ర గేయంగా జయ జయహే తెలంగాణ (Jaya Jayahe Telangana) గీతాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ గేయాన్ని కీరవాణి తో పాడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2009 డిసెంబర్ 9 తర్వాత నుండి అందే శ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గేయానికి తెలంగాణ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించిన విషయం తెల్సిందే.
గత బీఆరెస్ (BRS) ప్రభుత్వం రాష్ట్ర గేయంగా జయ జయహే ను ప్రకటిస్తామని చెప్పినా, ఆచరణలో సాధ్యం కాలేదు.
తాజగా సీఎం రేవంత్ తో అందే శ్రీ, కీరవాణి భేటీ కావడంతో జయ జయహే తెలంగాణ గేయాన్ని కీరవాణి తో పాడించి, బాణీలు అందించే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.