Tuesday 29th July 2025
12:07:03 PM
Home > తాజా > జేసీ ప్రభాకర్ రెడ్డి పై ‘మా’కు ఫిర్యాదు చేసిన హీరోయిన్

జేసీ ప్రభాకర్ రెడ్డి పై ‘మా’కు ఫిర్యాదు చేసిన హీరోయిన్

Actress Madhavi Latha Complaint on Jc Prabhakar Reddy | టీడీపీ సీనియర్ నాయకులు, తాడిపత్రి ( Tadipatri ) మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( Movie Artists Association ) కు ఫిర్యాదు చేశారు నటి మాధవి లత.

డిసెంబర్ 31 న జేసీ పార్కులో ఏర్పాటు చేసిన సెలెబ్రేషన్స్ సందర్భంగా వీరిద్దరి మధ్య వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంపై మాధవీలత ఆరోపణలు చేయగా, నటి ఆరోపణలపై స్పందిస్తూ జేసీ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో మాధవీ లత జేసీపై కంప్లైంట్ ( Complaint ) చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ట్రెజరర్ శివ బాలజీకి తన ఫిర్యాదు పత్రాన్ని నటి అందజేశారు. జేసీ చేసిన వ్యాఖ్యల్ని ఇండస్ట్రీ ఖండించలేదని, అందుకే ఫిర్యాదు చేస్తున్నట్లు మాధవీ లత పేర్కొన్నారు.

తనపై జేసీ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని దీనిపై హెచ్ఆర్సీ ( HRC ), పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తన న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కాగా మాధవిలత ఫిర్యాదు పై ట్రెజరర్ శివబాలాజీ స్పందిస్తూ ఈ విషయాన్ని మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇదిలా ఉండగా నటి మాధవీలత పై చేసిన వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పిన విషయం తెల్సిందే.

You may also like
స్టేడియం పిచ్ క్యూరేటర్-గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం
‘బాధితుల కోసం యాప్..మనం వచ్చాక సినిమా చూపిద్దాం’
‘IND vs PAK మ్యాచ్ చూడడానికి నా మనస్సాక్షి ఒప్పుకోలేదు’
డేవిడ్ వార్నర్ కు బాహుబలి కిరీటాన్ని పంపిన రాజమౌళి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions