Thursday 22nd October 2026
12:07:03 PM
Home > తాజా > Hyd మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రద్దీ చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం!

Hyd మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రద్దీ చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం!

Metro

Hyderabad Metro New Coaches DMRC Tender మహానగరంలో రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ (HMR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కొత్తగా 60 అదనపు స్టాండర్డ్ గేజ్ మెట్రో కోచ్‌లను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సుమారు రూ.923.62 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ కాంపిటీటివ్ బిడ్డింగ్ టెండర్లను ఆహ్వానించింది.

రద్దీ నివారణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు..

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో 57 రైళ్లు నడుస్తుండగా, ప్రతి రైలులో కేవలం 3 కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. వీటి ద్వారా రోజూ సుమారు 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో ఐటీ కారిడార్‌తో పాటు మియాపూర్ – ఎల్‌బీ నగర్ మార్గాల్లో రద్దీ తారాస్థాయికి చేరుకుంటోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకే కొత్త కోచ్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ కొత్త కోచ్‌ల సాయంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో రైళ్లను 6 కోచ్‌ల సామర్థ్యానికి పెంచడం లేదా ఫ్రీక్వెన్సీని పెంచే అవకాశం లభిస్తుంది.

టెండర్లు & గడువు వివరాలు..

బిడ్లు దాఖలు చేయడానికి ఆసక్తి గల జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు 2027 జనవరి 13 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు నిర్దేశించారు. జనవరి 14న సాంకేతిక బిడ్లను తెరవనున్నారు. కాంట్రాక్ట్ ఖరారైన తర్వాత సుమారు 125 వారాల (రెండున్నరేళ్లు) కాలపరిమితిలో కోచ్‌ల సరఫరా, టెస్టింగ్, కమిషనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫేజ్-2 విస్తరణతో సంబంధం లేకుండా ప్రస్తుత ఫేజ్-1 నెట్‌వర్క్‌లోనే రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

You may also like
గణేష్ ఊరేగింపులో మాంసం వ్యర్థాలు విసిరిన ముగ్గురు అరెస్టు!
Metro
మహిళా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్!
cm revanth reddy
Hyd Metro విస్తరణపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!
Metro
ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మెట్రో స్టేషన్లు ఇవే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions