Thursday 15th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఉదయం పెళ్లి.. సాయంత్రానికే విడిపోయిన నూతన జంట!

ఉదయం పెళ్లి.. సాయంత్రానికే విడిపోయిన నూతన జంట!

UP Marriage

Kanyakumari Wedding Issue నాలుగేళ్లుగా ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఎన్నో అడ్డంకులను దాటి, ఇరు కుటుంబాల పెద్దలను కష్టపడి ఒప్పించి పెళ్లి పీటలెక్కారు. అంతా సంతోషంగా సాగుతోందనుకున్న సమయంలో, వారి ఆనందం కొన్ని గంటలు కూడా నిలవలేదు.

ఉదయం వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన ఆ జంట.. సాయంత్రానికే విడిపోయింది. రిసెప్షన్‌ వేడుకలో మద్యం మత్తులో వరుడు చేసిన వీరంగం, దాడితో ఆ నాలుగేళ్ల ప్రేమకథ విషాదాంతమైంది. ఈ విచారకర ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో వెలుగుచూసింది.

ప్రేమ పెళ్లి వరకు ప్రయాణం..

కన్యాకుమారి జిల్లా రీతాపురం గ్రామానికి చెందిన రూబెన్ (31) ఆర్మీ సైనికుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు కేరళ సరిహద్దులోని పారసాలకు చెందిన ఓ ప్రైవేటు ఆసుపత్రి ఫార్మసిస్ట్‌ (26)తో నాలుగేళ్ల క్రితం పరిచయమై ప్రేమగా మారింది. మొదట వధువు కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినా, రూబెన్ శ్రమించి ఇరువైపుల పెద్దలను ఒప్పించాడు.

ఉదయం పెళ్లి.. సాయంత్రం రిసెప్షన్..

అక్టోబర్ 12 (సోమవారం) ఉదయం పారసాలలో వీరి వివాహం వైభవంగా జరిగింది. అదే రోజు సాయంత్రం వరుడి స్వగ్రామం రీతాపురంలో రిసెప్షన్ వేడుక ఏర్పాటు చేశారు. వధువు తండ్రి సంప్రదాయం ప్రకారం కూతురికి కానుకగా ఫర్నిచర్ తీసుకువచ్చారు.

మద్యం మత్తులో వరుడి రాక్షసానందం..

రిసెప్షన్‌కు రూబెన్ విపరీతంగా మద్యం తాగి, నిలబడలేని స్థితిలో తూలుతూ వచ్చాడు. అల్లుడి ప్రవర్తనపై మామ ప్రశ్నించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రూబెన్, మామపై తీవ్రంగా దూషిస్తూ దాడికి తెగబడ్డాడు. అడ్డువచ్చిన నూతన వధువుపై కూడా చేయి చేసుకున్నాడు.

గొడవ అనంతరం రూబెన్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వధువు, ఆమె తండ్రి కుళచ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది, కుళచ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రూబెన్‌పై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

అదే రాత్రి వధువు కన్నీళ్లతో తన తండ్రితో కలిసి పుట్టింటికి వెళ్లిపోవడంతో, ఉదయం ముళ్లబంధంతో ఒక్కటైన ఈ జంట సాయంత్రానికే విడిపోవాల్సి వచ్చింది.

You may also like
మేనమామ గా మారిన సీఎం విజయ్!
vijay swearing in ceremony
మూడు రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై తమిళనాడు నిషేధం!
కొడుకు ఫీజు కోసం.. బస్సుకు ఎదురెళ్లి తల్లి ఆత్మహత్య!
రాజకీయాల్లోకి స్టార్ హీరో.. త్వరలో పాదయాత్ర!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions