Tuesday 22nd September 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణకు భారీ వర్ష సూచన!

తెలంగాణకు భారీ వర్ష సూచన!

Rain Alert
  • తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్/ఆరెంజ్ అలర్ట్!
  • రానున్న 48 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు!

Heavy Rain Alert For Telangana బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజుల పాటు (మంగళ, బుధవారాల్లో) రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 12 గంటల్లో ఈ వాయుగుండం మరింత బలపడి ‘తీవ్ర వాయుగుండం’గా మారనుండటంతో ప్రజలు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు అధికారులు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. రాష్ట్రంలోని మరో 20 జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక…

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం తదుపరి 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకల సమీపంలో ఉన్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం కోరింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions