Thursday 8th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 30 ఏళ్ల న్యాయ పోరాటం: రూ. 20 లంచం కేసులో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట!

30 ఏళ్ల న్యాయ పోరాటం: రూ. 20 లంచం కేసులో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట!

supreme court
  • నిర్దోషులుగా విడుదల చేసిన సుప్రీంకోర్టు!

SC Acquits 20 Rupees Bribe Case | కేవలం రూ. 20 లంచం ఆరోపణలకు సంబంధించి సుమారు మూడు దశాబ్దాలుగా నలుగుతున్న కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలతో రుజువు కాకుండా కేవలం రూ. 20 స్వాధీనం చేసుకున్నారనే కారణంతో శిక్ష విధించడం సరికాదని స్పష్టం చేస్తూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక క్లర్క్ మరియు ప్యూన్‌లను సుప్రీంకోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.

ఏమిటీ కేసు? – కేసు నేపథ్యం..

ఈ వ్యవహారం 1996 ఫిబ్రవరి నాటిది. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా బెచారి గ్రామ పంచాయతీ కార్యాలయానికి విద్యా రాయితీల కోసం ఆదాయ ధృవీకరణ పత్రం పొందేందుకు ఒక విద్యార్థి వెళ్లాడు. సర్టిఫికెట్ కోసం క్లర్క్ రూ. 120 (క్లర్క్ కోసం రూ. 100, ప్యూన్ కోసం రూ. 20) లంచం డిమాండ్ చేశాడని ఆ విద్యార్థి ఏసీబీ (ACB)ని ఆశ్రయించాడు.

ఏసీబీ అధికారులు గుర్తుంచిన మార్క్డ్ నోట్లను విద్యార్థికి ఇచ్చి పంపగా, ఆ విద్యార్థి ప్యూన్‌కు రూ. 20 మాత్రమే ఇచ్చాడు. క్లర్క్ వద్ద ఏసీబీకి ఎలాంటి డబ్బు దొరకలేదు.

జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మరియు జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం ప్రాసిక్యూషన్ వాదనలలోని పలు వైరుధ్యాలను గమనించింది. వాంగ్మూలాల్లో తేడాలు: లంచం డిమాండ్‌పై సదరు విద్యార్థి విచారణ కోర్టు ముందు మరియు గతంలో భిన్నమైన వాంగ్మూలాలు ఇచ్చాడు.

క్రాస్ ఎగ్జామినేషన్‌లో ప్యూన్ తనను ఎలాంటి లంచం అడగలేదని విద్యార్థి స్వయంగా ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఈద్ పండుగ కావడంతో విద్యార్థే తనకు రూ. 20 సంతోషంగా ఇచ్చాడని ప్యూన్ చెప్పిన వాదనను కోర్టు సమర్థించింది.

క్లర్క్‌పై విచారణకు అనుమతి మంజూరు చేసిన అధికారికి తగిన అధికారాలు లేవని, దీంతో ఆ అనుమతి చట్టబద్ధంగా చెల్లదని తేల్చింది.

తీర్పు – నిర్దోషులుగా విడుదల..

అవినీతి నిరోధక చట్టం ప్రకారం అసలు లంచం డిమాండ్ చేశారనే ఆధారాలు లేనప్పుడు, కేవలం ప్యూన్ వద్ద రూ. 20 లభించినంత మాత్రాన నేరం రుజువు కాదని కోర్టు పేర్కొంది. గతంలో విచారణ కోర్టు (ట్రయల్ కోర్ట్) మరియు గుజరాత్ హైకోర్టు ఇచ్చిన శిక్షా తీర్పులను రద్దు చేస్తూ, ఆ ఇద్దరు ఉద్యోగులను సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

You may also like
“డజన్ మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు భార్యలు”: సీఎం డీకే కామెంట్స్!
దేశం మీకేం చేసింది కాదు.. మీరేం చేస్తారో ఆలోచించండి: నిర్మలా సీతారామన్
రూ. 5,000 కోట్ల ఆస్తి ఉన్న బీజేపీ ఎమ్మెల్యే.. బిచ్చగాడిలా మారి..!
నాతో కలిసి సాయం చెయ్ సోదరా.. విమర్శలకు సూద్ స్వీట్ రిప్లై!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions