Ladakh Minamarg Tourist Video లద్దాఖ్‌లోని మినామార్గ్ చెక్‌పోస్టు వద్ద భద్రతా సిబ్బందితో ఓ పర్యాటకురాలు గంటల తరబడి వాహనాలు నిలిపివేశారని వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్‌గా మారింది. కేవలం విఐపి కాన్వాయ్ కోసమే రోడ్డు మూసివేశారని, తాము జెన్ జీ (Gen Z) అని ఇలాంటివి సహించమని ఆమె ప్రశ్నించింది.ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. గతంలో కొంతమంది రాజకీయ నాయకుల పిల్లలు మా నాన్న ఎవరో తెలుసా అంటూ బెదిరింపులకు దిగేవారు.. ఇప్పుడు కొంతమంది మేం జెన్ జీలం అంటూ కొత్త రకంగా బెదిరింపుగా మారిపోయింది. అంటూ వ్యాఖ్యానించారు. ఇదే ఘటనపై ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ స్పందిస్తూ.. సైనికులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. దేశాన్ని కాపాడే సాయుధ బలగాలకు తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. వాతావరణం, రోడ్డు భద్రత కారణాల వల్లే మినామార్గ్-జోజిలా మార్గంలో వాహనాల రాకపోకలను నియంత్రిస్తామని అధికారులు స్పష్టం చేశారు.







