Thursday 20th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వివాహమైన 9 జంటలకు మళ్లీ పెళ్లి!

వివాహమైన 9 జంటలకు మళ్లీ పెళ్లి!

  • అన్నవరం రత్నగిరిపై వింత ఘటన..

9 Couples Remarried కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం రత్నగిరి సత్యదేవుని సన్నిధిలో ఒక అరుదైన, వింత సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే వివాహమై కాపురం చేస్తున్న 9 జంటలు మళ్లీ పెళ్లి చేసుకోవడం స్థానికంగా  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో జరిగిన పెళ్లిళ్లలో పలు దోషాలు ఉన్నాయని, ఆ దోషాలు తొలగిపోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు దంపతులు వెల్లడించారు. గతంలో జరిగిన వివాహ సమయంలో జాతక, ముహూర్త దోషాలు ఉన్నాయని, కుటుంబంలో కష్టాలు తీరాలంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఓ సిద్ధాంతి సూచించడంతో దంపతులు ఈ పున వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యదేవుని సన్నిధిలో మళ్లీ పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబంలో ఉన్న చికాకులు, ఆర్థిక కష్టాలు మరియు గ్రహ దోషాలు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుందని వారు బలంగా విశ్వసిస్తున్నారు. మళ్లీ పెళ్లి చేసుకున్న ఈ 9 జంటలలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామానికి చెందినవారు, విశాఖ జిల్లా ఆనందపురం మండలానికి చెందిన దంపతులుగా గుర్తించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions