Thursday 30th July 2026
12:07:03 PM
Home > క్రీడలు > టీమిండియా స్టార్ బ్యాటర్రిటైర్మెంట్.. తీవ్ర భావోద్వేగంతో..!

టీమిండియా స్టార్ బ్యాటర్రిటైర్మెంట్.. తీవ్ర భావోద్వేగంతో..!

Ajinkya Rahane Retirement | భారత క్రికెట్‌కు మరో దిగ్గజ ఆటగాడు వీడ్కోలు పలికాడు. టీమిండియా సీనియర్ బ్యాటర్, మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్య రహానె అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన భావోద్వేగ వీడియోలో తన నిర్ణయాన్ని వెల్లడించిన రహానె, ప్రసంగం సందర్భంగా కన్నీటి పర్యంతమవడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది.

భారత జట్టుకు అత్యంత విశ్వసనీయ టెస్ట్ బ్యాటర్లలో ఒకరిగా పేరొందిన రహానె, ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై తన సాంకేతికత, ఓర్పుతో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.

ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించిన కెప్టెన్

రహానె కెరీర్‌లో 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అత్యంత ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచింది. తొలి టెస్ట్ అనంతరం విరాట్ కోహ్లీ స్వదేశానికి రావడంతో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రహానె, గాయాలతో సతమతమవుతున్న జట్టును అద్భుతంగా నడిపించాడు.

అడిలైడ్‌లో ఘోర పరాజయం తర్వాత మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించి, చివరకు ఆస్ట్రేలియాపై 2-1తో చారిత్రక సిరీస్ విజయాన్ని సాధించాడు. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

“ఇదే సరైన సమయం”

రిటైర్మెంట్ ప్రకటిస్తూ రహానె మాట్లాడుతూ.. “ప్రతిదానికీ ఒక ఆరంభం, ముగింపు ఉంటాయి. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం కూడా జీవితంలో భాగమే. నా బ్యాటింగ్‌లో టైమింగ్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ఇప్పుడు ఆటకు వీడ్కోలు చెప్పడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను” అని తెలిపాడు.

ముంబైలోని డొంబివాలి నుంచి ప్రాక్టీస్ కోసం ప్రయాణించిన రోజులను గుర్తు చేసుకుంటూ, దేశం కోసం ఆడటమే తన కల అని చెప్పాడు. కుటుంబ సభ్యులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

“నా ప్రయాణం ముగిసినా, క్రికెట్‌తో నా అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుంది. తర్వాతి తరానికి నా అనుభవాన్ని పంచుకుంటాను. క్యాప్ నంబర్ 278… సైనింగ్ ఆఫ్” అంటూ తన సందేశాన్ని ముగించాడు.

రహానె అంతర్జాతీయ కెరీర్

అజింక్య రహానె భారత జట్టు తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 8,000కు పైగా పరుగులు చేశాడు. టెస్టుల్లో 12 సెంచరీలు, 5,077 పరుగులు సాధించాడు.

2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టులో చోటు దక్కించుకున్న రహానె, అదే ఏడాది వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు తర్వాత జట్టుకు దూరమయ్యాడు. రంజీ ట్రోఫీలో రాణించి తిరిగి జాతీయ జట్టులోకి రావాలని ప్రయత్నించినా అవకాశం రాకపోవడంతో చివరకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

https://twitter.com/search?q=ajinkya%20rahane&src=typed_query
You may also like
bcci
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. రూ. ఎన్ని కోట్లంటే!
నితీష్ హ్యాట్రిక్..ఆర్సీబీ కెప్టెన్ డకౌట్
అభిషేక్ శర్మ అంటే పాకిస్థానీలకు పిచ్చి..ఎంతలా వెతికారంటే!
SRH నుంచి బయటకు..క్లారిటీ ఇచ్చిన నితీశ్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions