Friday 11th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమెరికాలో ప్రమాదానికి గురైన కుమార్తె.. కాపాడాలని వేడుకుంటున్న తల్లిదండ్రులు!

అమెరికాలో ప్రమాదానికి గురైన కుమార్తె.. కాపాడాలని వేడుకుంటున్న తల్లిదండ్రులు!

Mancherial Student Injured In USA | ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కుమార్తె ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఉన్నారు. కూతురు అమెరికాలో ప్రాణాలతో పోరాడుతుంటే అండగా ఉండలేని దుస్థితిలో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

తన కుమార్తెకు సాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని, అధికారులను, అమెరికాలోని తెలుగు సంఘాలను వేడుకుంటున్నారు. కాగా మంచిర్యాల కార్పోరేషన్ పరిధి నస్పూర్ నాగార్జున కాలనీలో నివసించే లగిశెట్టి శ్రీనివాస్, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

పెద్ద కూతురు స్పందన చెన్నైలో బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లారు. తండ్రి క్యాబ్ డ్రైవర్ అయినప్పటికీ కుమార్తెను ఉన్నత చదువులు చదివించాలని భావించారు. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం ఎల్మర్ హర్ట్ యూనివర్సిటీలో స్పందన ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు.

అయితే మే 31న మెట్రో స్టేషన్ మెట్లపై నుండి స్పందన కిందపడిపోయారు. దింతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. కూతురు ప్రాణాలతో పోరాడుతుందనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రోధిస్తున్నారు.

పాస్పోర్ట్, వీసా లేకపోవడం అమెరికా వెళ్లేంతా ఆర్థిక స్థోమత తమకు లేదని బిడ్డను చూసుకోలేకపోతునట్లు తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఆమెకు అండగా వచ్చి సహాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions