Pawan Kalyan Social Media Post Viral | తెలంగాణ రాజకీయ క్షేత్రంలో జనసేన ప్రస్థానం మరియు తన పర్యటనలపై వస్తున్న విమర్శలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కవితాత్మక శైలిలో కౌంటర్ ఇచ్చారు.
మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో హాట్ ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని, రాజకీయ క్షేత్రంలో నిలబడి తీరుతామని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.
ఈ పొలిటికల్ హీట్ కొనసాగుతుండగానే.. ప్రముఖ కవి శేషేంద్ర శర్మ రచించిన ఒక పవర్ఫుల్ కవితను పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అదిప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.
ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో..
ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో
అదే నా రాస్తా
ఏ రాస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో
ఏ రాస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా..
ఈ కవిత ద్వారా రాజకీయాల్లో గెలుపోటములకు లొంగకుండా, ఎన్ని సవాళ్లు, సంకెళ్లు ఎదురైనా, చివరికి మరణం సంభవించినా సరే.. తాను ఎంచుకున్న యుద్ధ మార్గంలోనే ముందుకు సాగుతాననే బలమైన సంకేతాన్ని పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థులకు పంపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







