Tuesday 2nd June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > విదేశీయుల వీసా నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు!

విదేశీయుల వీసా నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు!

  • ఇమ్మిగ్రేషన్ రూల్స్ సవరణ..

Union Home Ministry Amends Immigration and Foreigners Rules 2025 | భారతదేశానికి వచ్చే విదేశీ పౌరుల వీసా గడువు పొడిగింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను  క్రమబద్ధీకరిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారైనర్స్ రూల్స్, 2025’ (Immigration and Foreigners Rules, 2025) నిబంధనలను సవరించింది.

ఈ మేరకు సవరించిన నూతన నిబంధనలతో కూడిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది.

180 రోజుల వీసా నిబంధనల్లో మార్పులు…
భారత్‌లో విదేశీయుల బస మరియు వీసా పొడిగింపునకు సంబంధించి రూల్ 12 సబ్-రూల్ (1) లో కేంద్రం స్పష్టమైన మార్పులు తీసుకొచ్చింది.

పాత నిబంధనల ప్రకారం.. 180 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలపరిమితి గల వీసాపై భారత్‌లోకి ప్రవేశించి, తమ బసను మరింత కాలం పొడిగించుకోవాలనుకునే విదేశీయులు.. తమ 180 రోజుల గడువు ముగిసిన 14 రోజులలోపు (Within 14 days) రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుండేది.

కానీ, తాజా సవరణ ప్రకారం.. ఆ 180 రోజుల గడువు ముగిసేలోపు “ఏ సమయంలోనైనా” (Any time before the expiry of 180 days) విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఒక క్యాలెండర్ ఇయర్ లో విదేశీయుల సింగిల్ స్టే లేదా మొత్తం బస 180 రోజులు మించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ.. ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడ అంతకంటే ఎక్కువ కాలం కొనసాగాలని భావిస్తే, గడువు ముగిసేలోపే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

అయితే, ఇలాంటి రిజిస్ట్రేషన్లను కేవలం “అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే” (Only in emergent circumstances) అనుమతిస్తామని కొత్త రూల్‌లో స్పష్టం చేశారు.

మిశ్రమ జాతీయత దంపతుల పిల్లలకు ఊరట..
భారతదేశంలో జన్మించే విదేశీ/మిశ్రమ జాతీయత కలిగిన దంపతుల పిల్లల వీసా సర్వీసుల విషయంలో కేంద్రం మానవతా దృక్పథంతో కూడిన పెద్ద ఊరటనిచ్చింది.

గత నిబంధనల ప్రకారం.. విదేశీ దంపతులకు (ఒకరు లేదా ఇద్దరూ విదేశీయులైనప్పుడు) భారత్‌లో సంతానం కలిగితే, కొత్త వీసా లేదా ఎగ్జిట్ పర్మిషన్ పొందడం కోసం శిశువు పుట్టిన 30 రోజులలోపు ఆన్‌లైన్ పోర్టల్/యాప్ ద్వారా ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌కు సమాచారం అందించడం (Electronic Intimation) తప్పనిసరి.

అయితే, నూతన సవరణ ప్రకారం.. సదరు దంపతులలో ఒకరు భారతీయ పౌరుడై ఉండి, ఆ బిడ్డకు భారతీయ పౌరసత్వాన్ని (Indian Citizenship) కొనసాగించాలని భావిస్తే.. ఆ తల్లిదండ్రులకు ఈ “30 రోజుల బర్త్ నోటిఫికేషన్” నిబంధన నుండి పూర్తి మినహాయింపు లభించింది.

 ఒకవేళ ఆ బిడ్డ భవిష్యత్తులో భారత్‌లో ఉన్నప్పుడే ఏదైనా ఇతర విదేశీ పౌరసత్వాన్ని గనుక పొందితే మాత్రం.. ఆ పౌరసత్వం వచ్చిన 30 రోజులలోపు తల్లిదండ్రులు విధిగా రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు సమాచారం అందించాల్సి ఉంటుంది. అలాగే ఆసుపత్రులు, మెడికల్ ఇన్‌స్టిట్యూషన్ల అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టింగ్ విధానాలను కూడా కేంద్రం సవరించింది.

You may also like
తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి ప్రధాని మోదీ సాల్యూట్!
పెట్రోల్ బంక్ మోసం.. 45 లీటర్ల ట్యాంక్‌లో 52 లీటర్లు!
ఢిల్లీ, ముంబైలపై భారీ ఉగ్ర కుట్ర భగ్నం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions