Saturday 30th May 2026
12:07:03 PM
Home > తాజా > ఉపాధి హామీ పనుల్లో ‘సరదా పెళ్లి’.. వధూవరులుగా మహిళా కూలీలు!

ఉపాధి హామీ పనుల్లో ‘సరదా పెళ్లి’.. వధూవరులుగా మహిళా కూలీలు!

wedding

Jagtial Malyala MGNREGA Workers Fun Wedding | నిత్యం శ్రమతో కూడుకున్న ఉపాధి హామీ పనుల్లో కాసేపు ఆటవిడుపు కోసం కూలీలు చేసిన ఒక సరదా ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు.. ఎండ వేడిని, పని అలసటను మర్చిపోయేందుకు ఒక క్యూట్ ‘పెళ్లి తంతు’ను సృష్టించి అందరికీ నవ్వులు పంచారు. పని విరామ సమయంలో ఈ వినోదభరిత ఘట్టం చోటుచేసుకుంది.

ఇద్దరు మహిళా కూలీలు ఒకరు వరుడిగా, మరొకరు వధువుగా మారి పెళ్లి పీటలెక్కినట్లు నటించారు. అక్కడ ఉన్న మిగతా మహిళా కూలీలంతా పెళ్లికి వచ్చిన అత్తలు, మామలు, బంధువుల్లా మారిపోయి చప్పట్లు కొడుతూ, అక్షింతలు వేస్తూ పెళ్లి తంతును రక్తికట్టించారు.

సాంప్రదాయ పద్ధతులను అనుకరిస్తూ వారు చేసిన ఈ హంగామా అంతా ఒకరు మొబైల్‌లో రికార్డ్ చేయగా, ఆ క్యూట్ వీడియో నెట్టింట చేరి తెగ చక్కర్లు కొడుతోంది. గ్రామీణ శ్రమజీవుల ముఖాల్లోని ఈ స్వచ్ఛమైన చిరునవ్వును చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

You may also like
ఐటీ ఉద్యోగానికి గుడ్‌బై.. ఆటో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌ వేర్ మహిళ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions