Saturday 30th May 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా!

తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా!

balka suman arrest
  • బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్!
  • నాంపల్లి పీఎస్‌లో నాన్ బెయిలబుల్ కేసు!

Balka Suman Arrest | బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు హైడ్రామా నడుమ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం, తోపులాటల అనంతరం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

సింగరేణి వ్యాఖ్యల వివాదం..
ఇటీవల సింగరేణి కాలరీస్ సంస్థపై బాల్క సుమన్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలే ఈ అరెస్టుకు దారితీశాయి. సుమన్ వ్యాఖ్యలపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో నాన్ బెయిలబుల్ (Non-Bailable) కేసు నమోదైంది.

శనివారం ఉదయం ఆయన తెలంగాణ భవన్‌లోనే ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు లోపలికి వెళ్లకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

ఈ క్రమంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులతో మాట్లాడిన పోలీసులు.. ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ లోపలికి వెళ్లారు.

రేవంత్ రెడ్డి, వివేక్ లపై సుమన్ ఫైర్..
అరెస్ట్ కావడానికి కొద్ది నిమిషాల ముందు తెలంగాణ భవన్ వెలుపల బాల్క సుమన్ మీడియాతో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును తాము ప్రశ్నిస్తున్నందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామిలు కక్షపూరితంగా తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని సుమన్ మండిపడ్డారు.

ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు.

మీడియా సమావేశం ముగిసిన వెంటనే పోలీసులు సుమన్‌ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్‌ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions