Friday 29th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘స్వచ్ఛంద వేశ్యావృత్తి నేరం కాదు’

‘స్వచ్ఛంద వేశ్యావృత్తి నేరం కాదు’

  • ‘ఆర్టికల్ 21’ కింద జీవించే హక్కులో భాగమే!
  • సెక్స్ వర్కర్లపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు!

Supreme Court Verdict On Sex Workers | దేశంలో సెక్స్ వర్కర్ల హక్కులు, వారి రక్షణకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.

వయోజనులు తమ స్వచ్ఛంద ఇష్టపూర్వకంగా వ్యభిచార వృత్తిని (వేశ్యావృత్తిని) ఎంచుకోవడం చట్టరీత్యా నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈ వృత్తిని ఎంచుకునే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (Article 21) ప్రకారం కల్పించబడిన వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులో ఒక భాగమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

జస్టిస్ జె.బి. పర్దివాలా మరియు జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక విచారణ జరిపి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

సమాన రక్షణ హక్కు..
లైంగిక కార్మికులు కూడా భారత రాజ్యాంగం ప్రకారం సమాజంలో పూర్తి గౌరవం, చట్టం ముందు సమాన రక్షణ పొందే హక్కు కలిగిన వృత్తి నిపుణులని కోర్టు గుర్తించింది.

ఈ తీర్పు ప్రకారం 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని వయోజనులుగా పరిగణిస్తారని, వారు తమ సొంత ఇష్టంతో ఈ వృత్తిలో కొనసాగవచ్చని బెంచ్ స్పష్టం చేసింది.

పోలీసుల వేధింపులకు చెక్.. సుప్రీంకోర్టు కీలక గైడ్‌లైన్స్..
సెక్స్ వర్కర్లను నేరస్థులుగా చూస్తూ పోలీసులు జరిపే వేధింపులపై సుప్రీంకోర్టు గట్టి అడ్డుకట్ట వేసింది. సెక్స్ వర్కర్లు తమ స్వచ్ఛంద ఇష్టంతో ఈ వృత్తిలో ఉన్నప్పుడు వారిని పోలీసులు వేధించడం, అరెస్టు చేయడం లేదా శిక్షించడం చేయకూడదు.

వ్యభిచార గృహాలపై దాడులు (రైడ్స్) జరిగినప్పుడు, స్వచ్ఛందంగా వృత్తిలో ఉన్న వయోజనులను బలవంతంగా రెస్క్యూ హోమ్స్ లేదా షెల్టర్ హోమ్స్‌కు తరలించరాదని స్పష్టం చేసింది.

ప్రైవసీకి భంగం కలిగించొద్దు..
సెక్స్ వర్కర్ల వద్ద కండోమ్‌లు కలిగి ఉండటాన్ని వారికి వ్యతిరేకమైన నేరంగా లేదా సాక్ష్యంగా పరిగణించరాదని కోర్టు ఆదేశించింది. వారి వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరించవద్దని హెచ్చరించింది.

ఇవి మాత్రం చట్టరీత్యా నేరమే..
లైంగిక కార్మికులకు చట్టపరమైన హక్కులు కల్పించినప్పటికీ.. వ్యభిచార గృహాలు (Brothels) నడపడం, ఇతరులను వారి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంత పెట్టడం లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా) ద్వారా ఈ కూపంలోకి దించడం చట్టరీత్యా పూర్తిగా నేరమని సుప్రీంకోర్టు సుస్పష్టం చేసింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions