Sunday 17th May 2026
12:07:03 PM
Home > తాజా > ‘చిరు లీక్స్’ ఈజ్ బ్యాక్.. ‘పెద్ది’ ట్రైలర్.. డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్!

‘చిరు లీక్స్’ ఈజ్ బ్యాక్.. ‘పెద్ది’ ట్రైలర్.. డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్!

Chiru Leaks On Peddi | మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్  (Ram Charan) ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi).

జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, మే 18న విడుదల కాబోతున్న అఫీషియల్ ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చారు.

ఎప్పటిలాగే తన అలవాటును రిపీట్ చేస్తూ ట్రైలర్‌లోని ఒక సంచలన డైలాగ్‌ను లీక్ చేసి మెగా అభిమానులకు పూనకాలు తెప్పించారు. ట్రైలర్ చూసి కంట్రోల్ తప్పాను! ట్రైలర్ ఇప్పటికే చూసిన చిరంజీవి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చిత్ర యూనిట్‌ను ఆకాశానికెత్తేశారు.

‘పెద్ది ట్రైలర్ చూశాను. జస్ట్ వావ్! 3 నిమిషాల పాటు PURE FIREPOWER PACKED TRAILER ఇది! చరణ్… బుచ్చి… రెహమాన్… ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు. అందరూ కలిసి రఫ్ఫాడించేశారు! మీరు ఎంత ఊహించుకున్నా, దాన్ని మించి ఈ ట్రైలర్ ఉంటుంది. Emotion… Elevation… Madness అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి’ అని రాసుకొచ్చారు.

చిరు లీక్ చేసిన డైలాగ్ ఇదే..
చాలా రోజుల తర్వాత మెగా అభిమానులకు ‘చిరు లీక్స్’ ట్రీట్ ఇస్తూ, సినిమాలో రామ్ చరణ్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్‌ను చిరంజీవి రివీల్ చేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు…” ఈ డైలాగ్ లీక్ చేసిన అనంతరం..

“సారీ బుచ్చిబాబు.. ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పి లీక్ చేసేశా!” అంటూ చిరంజీవి ఫన్నీగా ట్వీట్ ముగించడం నెట్టింట వైరల్‌గా మారింది.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ, లీక్ చేసిన డైలాగ్‌తో మే 18న రాబోతున్న ట్రైలర్ కోసం టాలీవుడ్ మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions