Tuesday 12th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > TN అసెంబ్లీలో సీఎం విజయ్ ‘కుట్టి స్టోరీ’!

TN అసెంబ్లీలో సీఎం విజయ్ ‘కుట్టి స్టోరీ’!

vijay kutty story in assembly

‌- స్పీకర్‌ను ఇద్దరు నేతలు ఎందుకు తీసుకెళ్తారో తెలుసా?

CM Vijay kutty story in Assembly | తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే అసెంబ్లీ వేదికగా తనలోని వాక్చాతుర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించారు.

మంగళవారం థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి టీవీకే ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత జె.సి.డి. ప్రభాకర్ తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా విజయ్ చెప్పిన ఒక ఆసక్తికరమైన కథ సభలో నవ్వులు పూయించింది. సంప్రదాయం ప్రకారం సభా పక్ష నేత కె.ఎ. సెంగోట్టయన్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కలిసి ఆయనను స్పీకర్ కుర్చీ వరకు తోడ్కొని వెళ్లారు.

స్పీకర్ ఎన్నిక అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం విజయ్.. స్పీకర్‌ను ఇద్దరు నేతలు కలిసి కుర్చీ వద్దకు తీసుకెళ్లే సంప్రదాయం వెనుక ఉన్న ‘బ్రిటిష్’ హిస్టరీని తనదైన శైలిలో వివరించారు.

“పూర్వం బ్రిటన్‌లో స్పీకర్ అనే వ్యక్తి పార్లమెంటుకు, రాజుకు మధ్య వారధిలా ఉండేవారు. ప్రజల నిర్ణయాలను రాజుకు చెప్పినప్పుడు, కోపంతో రాజు స్పీకర్‌కు మరణశిక్ష విధించేవారట. దాంతో స్పీకర్ పదవి అంటే అందరూ భయపడి పారిపోయేవారు.

అందుకే ఎన్నికైన వ్యక్తి భయంతో పారిపోకుండా ఉండేందుకు సభలోని ఇద్దరు ముఖ్య నేతలు ఆయనను పట్టుకుని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టేవారు.

ఆ సంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోంది” అని విజయ్ వివరించారు. విజయ్ ఈ కథను చాలా సరదాగా, సినిమాటిక్ పంచ్‌లతో చెప్పడంతో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సహా ఎమ్మెల్యేలందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions