Saturday 13th June 2026
12:07:03 PM
Home > తాజా > సిమ్ కొంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ.. ఎయిర్‌టెల్ వినూత్న ఆఫర్!

సిమ్ కొంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ.. ఎయిర్‌టెల్ వినూత్న ఆఫర్!

airtel petrol free offer

Airtel free petrol offer | ప్రస్తుతం నెలకొన్న పెట్రోల్ కొరతను సాకుగా తీసుకుని మొబైల్ నెట్‌వర్క్ సంస్థ ప్రతినిధులు ఒక వినూత్నమైన ఆఫర్‌ను తెరపైకి తెచ్చారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఎయిర్‌టెల్ సిబ్బంది ప్రకటించిన ఈ ‘పెట్రోల్ ఆఫర్’ ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.

ఎవరైనా వినియోగదారులు తమ ప్రస్తుత నెట్‌వర్క్ నుండి ఎయిర్‌టెల్‌లోకి పోర్ట్ (MNP) అయి, రూ. 350తో రీచార్జ్ చేసుకుంటే వారికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా అందజేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్న తరుణంలో, ఈ ఆఫర్ గురించి తెలియగానే జనం ఎయిర్‌టెల్ సిమ్ కార్డులు తీసుకునేందుకు క్యూ కడుతున్నారు.

సాధారణంగా డిస్కౌంట్లు లేదా డేటా ఆఫర్లు ఇచ్చే నెట్‌వర్క్ కంపెనీలు, ఇలా నేరుగా ఇంధనాన్ని ఆఫర్ చేయడం చర్చనీయాంశమైంది.

మార్కెటింగ్ ప్రతినిధుల తెలివితేటలకు కొందరు నెటిజన్లు ఫిదా అవుతుంటే, అవసరాన్ని వ్యాపారంగా మార్చుకోవడంపై మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions