BRS Counter To TRS | తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) గా ప్రకటించడంపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
బీఆర్ఎస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో కోల్‌గేట్ (Colgate) వర్సెస్ కూల్‌గేట్ (Coolgate), అలాగే బిస్లరీ (Bisleri) వర్సెస్ బిలిసరి (Bilisari) వంటి ఫోటోలను షేర్ చేసింది.
ఈ ఫోటోలకు “ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే” అనే క్యాప్షన్‌ను జత చేసింది. తద్వారా కేసీఆర్ గారు గతంలో నడిపిన అసలైన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) వేరని, ఇప్పుడు కవిత గారు పెట్టిన టీఆర్ఎస్ కేవలం ఆ పేరును వాడుకోవడమేనని బీఆర్ఎస్ పరోక్షంగా ఎద్దేవా చేసింది.
ఈ పోస్టులు ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు, ఎక్స్ (ట్విట్టర్)లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. “రాజకీయాల్లో బ్రాండ్ వార్ అంటే ఇలా ఉంటుందా?” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మునీరాబాద్ సభలో కవిత గారు మాట్లాడుతూ కేసీఆర్ గారిని ‘మర మనిషి’ అని, కేటీఆర్ గారిని ‘గుంటనక్కల చేతుల్లో ఖైదీ’ అని విమర్శించిన నేపథ్యంలో, బీఆర్ఎస్ నుండి ఈ స్థాయిలో కౌంటర్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.






