Friday 17th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > లోక్ సభలో నవ్వులు పూయించిన రాహుల్ గాంధీ!

లోక్ సభలో నవ్వులు పూయించిన రాహుల్ గాంధీ!

rahul gandhi speech

Rahul Gandhi Lok Sabha speech | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన వాక్చాతుర్యంతో సభను నవ్వుల్లో ముంచెత్తారు.

రాజకీయ విమర్శలు చేస్తూనే, మధ్యమధ్యలో ఆయన విసిరిన చమత్కార బాణాలు అధికార పక్ష సభ్యులను కూడా నవ్వించాయి.

పురుషుల జీవితాల్లో మహిళల ప్రభావం గురించి మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని మహిళల (తల్లి, సోదరి, భార్య) నుంచి ఎంతో నేర్చుకుంటారు. అయితే, నాకూ మరియు ప్రధాని మోదీ గారికి ‘భార్య సమస్య’ లేదు. కాబట్టి మాకు ఆ ఇన్‌పుట్స్ అందవు.. అందుకే మేము మా తల్లులు, సోదరీమణుల సలహాలు తీసుకుంటాము” అని అనడంతో సభలో నవ్వులు విరిశాయి.

అనంతరం తన సోదరి ప్రియాంక గాంధీ గురించి ప్రస్తావిస్తూ.. “నేను నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో చేయలేని పనిని నా సోదరి నిన్న కేవలం ఐదు నిమిషాల్లో చేసింది. అదే హోంమంత్రి అమిత్ షా గారిని నవ్వించడం అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో మరోసారి నవ్వులు విరిశాయి.

అంతకుముందు రోజు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. “నేడు చాణక్యుడు బతికి ఉంటే, మీ రాజకీయ చతురత చూసి ఆయన కూడా షాక్ అయ్యేవారు” అని అమిత్ షాను ఉద్దేశించి అనడం, దానికి షా గారు చిరునవ్వు చిందించడం తెలిసిందే.

నవ్వులు పూయిస్తూనే, రాజకీయంపై రాహుల్ ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని మోదీని ‘మెజీషియన్’ (మాయగాడు) తో పోలుస్తూ.. ఇప్పుడు ఆయన దగ్గర ట్రిక్కులు అయిపోయాయని, అందుకే మహిళా బిల్లు వెనుక డీలిమిటేషన్ అనే కుట్రను దాచారని ఆరోపించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions