Tuesday 31st March 2026
12:07:03 PM
Home > క్రైమ్ > జడ్జి కళ్లముందే నిందితుడు జంప్.. సినిమా ఫక్కీలో కోర్టు నుంచి పరార్!

జడ్జి కళ్లముందే నిందితుడు జంప్.. సినిమా ఫక్కీలో కోర్టు నుంచి పరార్!

accused escapes from court


Suspect Escapes From Court | బ్రిటన్ రాజధాని లండన్‌లో (London) ఒక నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. మాదకద్రవ్యాల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఒక నిందితుడు, జడ్జి తనను కస్టడీకి పంపబోతున్నారని తెలుసుకున్న మరుక్షణమే కోర్టు హాల్ నుండి పారిపోయాడు.

మార్చి 17న సాయంత్రం 4 గంటల సమయంలో క్రోయిడాన్ క్రౌన్ కోర్టులో ఈ ఘటన జరిగింది. తూర్పు లండన్‌లోని హాక్నీకి చెందిన అబు ఫాయే (26) అనే వ్యక్తిపై మొత్తం 10 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి.

మత్తు పదార్థాలను కలిగి ఉండటంతో పాటు, వాటిని ఇతరులకు సరఫరా చేస్తున్నాడనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. విచారణ సమయంలో అబు ఫాయే డ్రగ్స్ కలిగి ఉన్నట్లు అంగీకరించాడు.

నిందితుడు నేరం ఒప్పుకోవడంతో, జడ్జి అతడిని వెంటనే రిమాండ్‌కు పంపాలని నిర్ణయించారు. ఈ విషయం అర్థమైన వెంటనే, అబు ఫాయే కోర్టు అధికారులను తోసుకుంటూ మెరుపు వేగంతో బయటకు పరుగులు తీశాడు.

నిందితుడు కోర్టు నుండి బయటకు పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు అతడి కోసం గాలింపు ముమ్మరం చేసినప్పటికీ, గత రెండు వారాలుగా (మార్చి 30 వరకు) అతని ఆచూకీ లభించలేదు.

మెట్రోపాలిటన్ పోలీసులు అబు ఫాయే కోసం దేశవ్యాప్తంగా గాలింపు చేపట్టారు. నిందితుడికి హాక్నీతో పాటు పెంగే మరియు కేంబ్రిడ్జ్ ప్రాంతాల్లో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అబు ఫాయే కనిపిస్తే ఎవరూ నేరుగా అతని వద్దకు వెళ్లవద్దని, వెంటనే 999 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని మెట్ పోలీసులు ప్రజలను కోరారు.

కోర్టు హాల్ లో భద్రత కట్టుదిట్టంగా ఉన్న సమయంలోనే ఒక నిందితుడు ఇలా పారిపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions