Friday 12th June 2026
12:07:03 PM
Home > క్రీడలు > సన్ రైజర్స్ లోకి పాక్ ప్లేయర్.. కావ్య మారన్ పై నెటిజన్లు ఫైర్!

సన్ రైజర్స్ లోకి పాక్ ప్లేయర్.. కావ్య మారన్ పై నెటిజన్లు ఫైర్!

kavya maran trolled by fans for pak player

Fans Fire On Kavya Maran | సన్ రైజర్స్ హైదరాబాద్ (Sun Raisers Hyderbad) ఓనర్ కావ్య మారన్ (Kavya Maran) పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంగ్లాండ్ లో ‘ది హండ్రెడ్ లీగ్’ కొనసాగుతున్న విషయం తెల్సిందే.

ఇందులో సన్ రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ ప్లేయర్ ను కొనుగోలు చేయడం వివాదంగా మారింది. ఈ జట్టుకు కూడా కావ్య మారన్ ఓనర్ గా వ్యవహరిస్తున్నారు.

తాజగా జరిగిన వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ జట్టు రూ.2.34 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదే ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణం అయ్యింది.

గతంలో భారత ఆర్మీని ట్రోల్ చేస్తూ అబ్రార్ అహ్మద్ సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు. ఇలా భారత ఆర్మీని ఎగతాళి చేసిన ఆటగాడిని ఎలా కొనుగోలు చేస్తారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

అలాగే కావ్య మారన్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ లో భాగంగా హైదరాబాద్ మ్యాచులను బాయ్ కట్ చేయాలని పోస్టులు చేస్తున్నారు.

మరోవైపు ఎక్స్ లోని సన్ రైజర్స్ లీడ్స్ అకౌంట్ కూడా సస్పెండ్ అయ్యింది. రూల్స్ ఉల్లంఘించిన అకౌంట్లను ఎక్స్ ఇలా సస్పెండ్ చేస్తుంది. అయితే యూజర్లు అధిక సంఖ్యలో రిపోర్ట్ చేయడంతోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

You may also like
kavya maran trolled by fans for pak player
విజయ్ సునామీ దెబ్బ.. కావ్య మారన్ కుటుంబానికి భారీ షాక్!
sunrisers leeds abrar ahmed controversy
సన్‌రైజర్స్ ‘పాక్’ ప్లేయర్ వివాదం.. బీసీసీఐ స్పందన ఇదీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions