Friday 11th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన మోదీ!

ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన మోదీ!

modi phone call to iran president

Modi Speaks To Iran’s President | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఇరాన్ అధ్యక్షుడు (Iran President Masoud Pezeshkian) మసూద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు.

గురువారం సాయంత్రం ఫోన్ కాల్ చేశారు. ఇరాన్ (Iran), పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర పరిస్థితిపై ఇరువురు దేశాధినేతలు చర్చించారు. పౌరుల మరణాలు, నిర్మాణాలకు నష్టం జరగడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

భారతదేశం శాంతి, స్థిరత్వం కోసం నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, సంభాషణలు, దౌత్యపరమైన మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించాలని మోదీ పేర్కొన్నారు.

ఇరాన్ అధ్యక్షుడు ప్రాంతీయ పరిస్థితుల గురించి వివరించారు. భారతీయుల భద్రత, ఇంధన సరఫరా సాఫీగా సాగడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది.

You may also like
ఆ క్రెడిట్ మీరే తీసుకోండి.. ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి!
Mallikarjuna Kharge
యూఎస్ ముందు మోదీ సరెండర్.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు!
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!
modi
పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని పర్యటన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions