Friday 5th June 2026
12:07:03 PM
Home > తాజా > రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు.. అత్యధికం ఎంతంటే!

రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు.. అత్యధికం ఎంతంటే!

engineering fee in tg

Engineering Fee In Telangana | తెలంగాణ రాష్ట్రంలోని 160 ఇంజినీరింగ్‌ కాలేజీ (Engineering Fee) లకు కొత్త ట్యూషన్‌ ఫీజులను నిర్ధారిస్తూ ప్రభుత్వం గురువారం  జీవో జారీ చేసింది. ఈ కొత్త ఫీజులు 2025-26 నుంచి 2027‌-28 ఆర్థిక సంవత్సరాల బ్లాక్‌ పీరియడ్‌కు వర్తిస్తాయి.

ఈ విద్యా సంవత్సరాల్లో బీటెక్‌ మొదటి సంవత్సరంలో చేరినవారికి ఈ కొత్త ఫీజులు వర్తిస్తాయి. ఆయా స్టూడెంట్స్ నాలుగేళ్లపాటు అవే జీజులు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 33 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో రూ.లక్షకు పైగా.. రెండు కాలేజీలకు రూ.లక్షగా ఫీజును నిర్ణయించారు.

అత్యధికంగా సీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీకి ఫీజు రూ.1.83 లక్షలుగా విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. రూ.1.75 లక్షలతో వాసవి కాలేజీ రెండో స్థానంలో నిలిచింది. 70 కాలేజీలకు ఒక్క రూపాయి కూడా పెంచకుండా సర్కార్‌కు సిఫార్సు చేసింది.

21 కాలేజీలకు కనీస ఫీజు రూ.45 వేలు గా నిర్ణయించారు. ఈ మేరకు ఆ సిఫార్సుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కొత్త ట్యూషన్ ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచే అమల్లోకి వస్తాయి.  

You may also like
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions