Wednesday 2nd September 2026
12:07:03 PM
Home > తాజా > వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు: మంత్రి

వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు: మంత్రి

Velugumatla Issue | వెలుగుమట్ల (Velugumatla) నిర్వాసితులకు మార్చి 15లోపు పట్టాలివనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. వెలుగుమట్ల వంటి సంఘటనలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయని దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు.

ఆదివారం ఖమ్మం ఐడిఓసి వేదికగా వెలుగుమట్ల బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. వాస్తవానికి ​వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేళ్లుగా దళారుల ఉచ్చులో చిక్కి, అప్పుల పాలై నిరుపేదలు నరకయాతను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.

రెక్కాడితే గానీ డొక్కాడని వారు రూ. 30 వేల నుంచి రూ. 8 లక్షల వరకు అప్పులు చేసి దళారులకు చెల్లించారని పట్టాలొస్తాయని నమ్మబలికి పేదలకు ఆశ చూపెట్టి దానినే ఆసరా చేసకుని నట్టేట ముంచారని వెల్లడించారు.

పడగొట్టడానికి కొన్ని గంటల ముందు కూడా కొందరు 4 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. తీరా ఇల్లు కట్టుకున్నాక అధికారులు వచ్చి కూల్చేయడంతో వారంతా రోడ్డున పడ్డారని వివరించారు.

అప్పులు చేసి నిర్మించుకున్న ఆశల గూడు కూలిపోయిందని ఆవేదన చెందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటదని భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions