Tuesday 14th April 2026
12:07:03 PM
Home > తాజా > మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం

మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం

Manchu Manoj News Latest | నటుడు మంచు మనోజ్ తాజగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నేటి యువతను ఉద్దేశించి ఇతరుల మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దని సందేశం ఇచ్చారు. గీతం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడున్న విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ..గౌరవం అనేది చేసే పనులు ద్వారా మాత్రమే వస్తుందని అంతేగాని మనం వాడే వస్తువుల మూలంగా కాదన్నారు.

ఈ సందర్భంగా తన ఐ ఫోన్ చూపించారు. తన ఐ ఫోన్ పాతదే అయినప్పటికీ దానికి 17 ప్రో మాక్స్ ఫోన్ కవర్ వేసి వాడుతున్నట్లు చెప్పారు. ఇది చూసిన విద్యార్థులు కేరింతలతో సందడి చేశారు. డబ్బు వృధా చేయకుండా ఉన్నదానితో సంతోషంగా ఉండాలన్నారు. ఇతరుల మెప్పు కోసం అప్పులు చేయవద్దన్నారు. ఉన్నదానితో తృప్తిగా ఉండటమే అసలైన సంతోషం అని మనోజ్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions