Tuesday 14th April 2026
12:07:03 PM
Home > తాజా > బల్కంపేట ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ..అధికారులపై వేటు

బల్కంపేట ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ..అధికారులపై వేటు

Konda Surekha In Balkampeta Temple | బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. శుక్రవారం ఆకస్మిక తనిఖీ సందర్భంగా దేవాలయ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురు అధికారులపై వేటు వేశారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం వంటి తీవ్రమైన అంశాలను మంత్రి గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నలుగురు సిబ్బందిని సేవల నుండి తొలగించాలని ఆదేశించారు.

అలాగే పరిపాలనా మరియు పర్యవేక్షణ లోపాల కారణంగా దేవాలయ సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)లను సస్పెండ్ చేయాలని ఆదేశింశారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని, తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ నిర్వహణ పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions