Tuesday 14th April 2026
12:07:03 PM
Home > తాజా > GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం

GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం

Govt to replace GHMC Act with Core Urban Act | ఓఆర్ఆర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కొత్త కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనులన్నీ ఆ చట్టం ఆధారంగా ఉండాలని సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యం, రోడ్ల నాణ్యత, వీధి దీపాల మానిటరింగ్, ఫుడ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఆర్ & బీ తదితర విభాగాల పరిధిలోని రోడ్లన్నీ ఎంఏయూడీ పరిధిలోకి తేవాలని సూచించారు.

ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, చెరువులు–కుంటల అభివృద్ధి, సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌నున్న 99 రోజుల కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ ప‌రిధిలో చేప‌ట్టే ప‌నులు తొలుత చేప‌డ‌తామ‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions